కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి

కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
  • హుజూరాబాద్ లో ఓటమి భయంతోనే రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు సృష్టిస్తున్నాడు
  • కేసీఆర్ చేతకానితనం వల్లనే కృష్ణా జలాల్లో అన్యాయం
  • టీఆర్ఎస్ ఎన్ని కోట్లు పెట్టినా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలవదు-బండి సంజయ్

హైదరాబాద్: ఏపీ ఒకవైపు ప్రాజెక్టులు కడుతుంటే కేసీఆర్ రెండేండ్ల తర్వాత స్పందించి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసినందుకు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ రాజకీయ లబ్ది పొందేందుకే రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు సృష్టిస్తున్నాడని ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఇద్దరు ఒక్కతాను ముక్కలేనని ఆయన విమర్శించారు. కృష్ణా జలాల్లో 575 టీఎంసీలు  తెలంగాణకు  రావాల్సి ఉండగా 299 టీఎంసీలకే కేసీఆర్ ఒప్పంద పత్రంలో సంతకం చేసి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నడి ఆరోపించారు. ఇప్పుడేమో ఏమీ తెలియనట్లు కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నడని ఆరోపించారు. కేంద్రం పెట్టిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు రాకుండా డుమ్మా కొట్టాడని ఆయన గుర్తు చేశారు. 
హుజూరాబాద్ లో ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే తెలంగాణ, ఏపీ ప్రజల మధ్య సెంటిమెంట్ ను రెచ్చ గొడుతున్నాడని, కేసీఆర్ కేసీఆర్ చేతకానితనం వల్లనే కృష్ణా జలాల్లో తెలగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. ఎన్ని కోట్లు పెట్టినా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవలేదని.. అన్ని రిపోర్ట్ లు ఈటల రాజేందర్ గెలుస్తున్నడని చెప్తున్నాయని బండి సంజయ్ వెల్లడించారు. 
ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకున్నము.. ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాం.. హుజూరాబాద్ బిజెపి దేనని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వాడుకుంటూ మోడీ ఫోటో కూడా పెట్టడం లేదు కేసీఆర్ అని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తుంటే తెలంగాణ ప్రజలకు కనీసం వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పని దుర్మార్గమైన ముఖ్యమంత్రి కేసీఆర్ అని.. అయితే భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలను కాపాడుతోందన్నారు. వ్యాక్సిన్, రేషన్ బియ్యం,  కేంద్ర నిధుల విషయంలోకూడా కేసీఆర్ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని, వ్యాక్సిన్ కోసం 2500 కోట్లు కేటాయిస్త అన్నాడు.. ఎటు పోయిన 2500 కోట్లు? అని బండి సంజయ్ ప్రశ్నించారు. 
దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేడు.. సాధికారిత పేరుతో సమావేశాలా..?
అధికారంలోకి వచ్చే ముందు రాష్ట్రంలోని ప్రతి దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తానని ఇప్పటికీ ఇవ్వలేని ముఖ్యమంత్రి దళితుల సాధికారిత పేరుతో ఏం మొహం పెట్టుకుని సమావేశాలు పెట్టుకుంటున్నాడని బండి సంజయ్ ప్రశ్నించారు. నీ కల్లబొల్లి మాటలు దళితులు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. దళితుడిని సీఎం చేయకుంటే తల నరుక్కుంటా అన్న కేసీఆర్.. అధికారంలోకి రాగానే దళితులను కేసీఆర్ మోసం చేస్తున్నాడని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ను దళితులు నమ్మొద్దు అని ఆయన సూచించారు. హుజూరాబాద్ లో ఉప ఎన్నికలు వస్తున్నందునే రాజకీయా  జిమ్మిక్కులు చేస్తున్నడని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.